భగవంతుడు సర్వాంతర్యామి అన్నది ఎంతనిజమే … ఇప్పుడు రాజకీయాలు కూడా అంతేనిజం. వడ్డించే వాడు మనవాడుంటే భోజనాల బంతిలో చివర కూర్చున్నా పంభక్ష పరమాణ్నాలు అబ్బుతాయన్నది సామెత. ఇప్పుడు ఏపీలోకూడా అలాంటి పరిస్తితే ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్న ఒ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారబోతోంది. బాబు తన సొంతవాల్లకు ఎలాంటి పనైనా చేసిపెట్టడంలో వెనకాడదు. ఎంత అధికార పార్టీ నాయకుడైతే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనీ ప్రజలు అవాక్కయ్యారు.
అదే నండీ విజయవాడ ఎంపీ కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సులను ఆర్టీసీ సంష్థకు అంటగట్టేందుకు చకచకా పావులు కదుపుతున్నారనే వార్త ఇప్పుడు హల్ చేస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ సంష్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన కార్పొరేషన్. ప్రతీ సంవత్సరం అప్పులు పెరుగుతున్నాయేగాని తగ్గడంలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ సంస్థ పరిస్తితి మాత్రం ఎక్కడవేసిన గొంగలి అన్న చందంగా తయారయ్యింది.ప్రజా రవాణా వ్యవస్తలో ఆర్టీసీ ఎంత పాత్ర పోషిస్తోంది అందరికీ తెలిసిందే. 61000 వేల మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నసంస్థ. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థపై మరింత బారం మోపేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.కేశినేని ట్రావెల్స్‌ను ఇటీవల వివాస్తాద రీతిలో మూసివేసిన నేపథ్యంలో ఆయన అద్దె బస్సుల రూపంలో ఏపీఎస్ఆర్టీసీలో పాగే వేసేందుకే న్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీ ఈ మధ్యన ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం – ఆయన గన్ మెన్ పై దాడి ఘటనతో తెరపైకి వచ్చిన కేశినేని నాని వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పించడంతో తెరపడిందని చాలామంది భావించారు.కానీ తిరకాసు అంతా అక్కడే ఉందంటున్నారు.
ప్రస్తుతం కేశినేని నిలిపివేసిన బస్సుల్లో కండిషన్ లో ఉన్న సుమారు 100 బస్సులను ఆర్టీసి అద్దె ప్రాతిపదిక తీసుకునేందుకు అధికారలు రంగం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అందుకు కేశినేని నాని వ్యూహాత్మకంగా ఆరు నెలలనుంచే పావులు కదుపుతున్నారు.దీంతో ఒకే సారి 100 ఏసీ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకొనేందుకు అధికారులు ఆమోదముద్ర మేశారు.దీనిపై సీఎంవోకూడా అర్టీసీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే అద్దె బస్సులను ఆర్టసీలోకి తీసుకొనే ప్రతిపాదనను ఆర్టీసీ కార్మిక వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. అదే జరిగితే ఆర్టీసి సంస్థ అద్దెబస్సులను భరించే స్థాయిలో లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 6 నెలల క్రితం వరకూ ఆర్టీసీలో అద్దె బస్సులు లేవు. అయితే తర్వాత 21 ఇంద్ర బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఇప్పుడు అదే ప్రాతిపదికన కేశినేని ట్రావెల్స్‌కు చెందిన సుమారు 100 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి.
ఇదే జరిగితే సంస్థనష్టాలను భరించాలంటే అంతిమంగా టికెట్ ఛార్జీల పెంపుభారం ప్రజలపైన పడనుందనీ దీవి వల్ల ఆర్టసీ పూర్తిగా నిర్వీర్యం కానుందనీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నింటినీ అడ్డుకొనేందుకు సంఘాలు సమ్మెకు సిద్దమవుతున్నట్లు సమాచారం. వేసవి సీజన్ కావడంతో ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉందన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.కేశినేనికి చెందిన 100 ఏసీ బస్సులను ఆర్టీసీకీ కట్టబెట్టడానికి మార్గం సుగుమం చేసేందుకు ఆర్టీసీ పెద్దలు ఇప్పటికే కార్యాచరణ కు దిగినట్లుసమాచారం. ప్రజా సమస్యలపై స్పందచని ప్రభుత్వం తన అనుయాయులకోసం ఎంత పనైనా చస్తుందనే వాదనలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి.ఎప్పటినుంచో ఆర్టీసీనీ ప్రయివేటు పరంచేయాలనీ ప్రభుత్వాలు చూస్తున్నాయి.అన్నీ సక్రమంగా జరిగితే త్వలోనే ఏపీఎస్ఆర్టీసీ కేశినేని ఆర్టీసీగా మారడానికి ఎక్కవసంయం పట్టకపోవచ్చు.మరి దీని మీద రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయే చూడాలి.
Related
