Sunday, May 5, 2024
- Advertisement -

కమ్మ మంత్రులపై కుట్రలు

- Advertisement -

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్య కేసు తనకు తలనొప్పిగా మారుతున్న తరుణంగా అజయ్ కులం కార్డు బయటకు తీశారు. కమ్మ సామాజిక మంత్రులపై కుట్రలు పన్నుతున్నారంటూ పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాలను కొందరు రాద్ధాంతం చేస్తున్నారని కామెంట్ చేశారు.

అందుకే కమ్మ కులస్తులందరూ ఐక్యంగా ఉండాలని పిలపునిచ్చారు. సాయి గణేష్ ఆత్మహత్య చాలా చిన్న విషయం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తానొక్కడినే కమ్మ మంత్రినని అజయ్ గుర్తు చేశారు. కావాలనే కొంతమంది తనపై కుట్ర పన్నుతున్నారన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఇటీవలే మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టింది. కొత్త కేబినెట్ లో చోటు దక్కని కులాల్లో కమ్మకులం కూడా ఉంది.

అంతకు ముందు కేబినెట్ లో ఆ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని ప్రాతినిధ్యం వహించగా..ఈ సారి ఆయనకు మంత్రిగా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్ కుమార్ కులం కార్డు బయటకు తీయడం చర్చనీయాంశమైంది.

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రేవంత్ వార్నింగ్

సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేశాం

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -