Thursday, April 25, 2024
- Advertisement -

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ

- Advertisement -

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్ ను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని తేల్చిచెప్పింది. వెంటనే ఆయన్ను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు 2020 మే 22న తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. అయితే గురవారం కూడా ఇదే అంశంపై విచారించిన ధర్మాసనం రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలను పరిశీలించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు, నివేదిక శుక్రవారంలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. శుక్రవారం ప్రభుత్వం సమర్పించిన నివేదికలో స్పష్టమైన వివరాలు లేకపోవడంతో మరికొంత సమయం కావాలని ఏపీ సర్కార్ కోరింది.

అందుకు ససేమిరా అన్న సుప్రీం కోర్టు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల సస్పెన్షన్ 2022 ఫిబ్రవరి 7తో ముగియడంతో..ఆ తర్వాత రోజు నుంచే ఆయనకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు భద్రతా ఉపకరణాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

ఏపీ నిధుల దారి మళ్లింపుపై సుప్రీం సీరియస్

ఉచితాలు కొంప ముంచుతాయ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -