కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆ నటి.. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధిన బారినపడి చనిపోయింది. ఆ హీరోయిన్ పేరు నిషా నూర్. తమిళ స్టార్ హీరోలు అయిన రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో నటించిన ఆమె.. తన నటనతో, అభినయంతో.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
కమల్ హాసన్ నటించిన 1981లో విడుదలైన “టిక్ టిక్ టిక్”తో పాటు ‘కళ్యాణ అగదిగళ్’ అనే తమిళ సినిమాల్లో నిషా నూర్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు సినీ ఛాన్సులు తక్కువయ్యాయి. దాంతో డబ్బు సంపాదన కోసం వక్రమార్గాన్ని అనుసరించారు. ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుచప్పుడు కాకుండా సాగినప్పటికీ.. మీడియా దృష్టిలో పడకుండా దాచలేక పోయింది. దీంతో అప్పటివరకు చేతిలో ఉన్న చిత్రాలే కాకుండా, సినీ అవకాశాలే రాకుండా పోయాయి.
{loadmodule mod_custom,Side Ad 1}
దాంతో తన జీవనం కోసం సెక్స్‌వర్కర్‌గా స్థిరపడిపోయింది. అలా స్థిరపడిన నిషా నూర్.. హెచ్ఐవీ బారిన పడింది. చివరకు 2005లో తమిళనాడులోని ఓ ఆశ్రమంలో చేరింది. అప్పటికే ఎయిడ్స్ వ్యాధి బాగా ముదిరిపోవడంతో చివరకు 2007లో కన్నుమూసింది. సినిమా అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. చివరకు అదే చిత్ర పరిశ్రమ చేయివదిలిపెట్టడంతో డబ్బు కోసం తన శరీరాన్ని అమ్ముకుని ప్రాణాంతక వ్యాధి బారినపడి అనాథలా చనిపోయింది. ఇక ఇటివలే కాలంలో కొందరు హీరోయిన్స్ వ్యభిచార కేసుల్లో అడ్డంగా దొరకడం.. సినీ ఛాన్సులు లేక అర్థాంతరంగా తనువు చాలిస్తుండటంతో నటి నిషా నూర్ విషాద గాధ మరోమారు చర్చల్లోకి వచ్చింది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
