Friday, May 10, 2024
- Advertisement -

అందరి దృష్టి ఆ 3 నియోజకవర్గాలపై!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాలపైనే చర్చ జరుగుతోంది. కృష్ణా జిల్లాలోని ఆ మూడు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు..?ఎవరికి సీటిస్తారు అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవంటే. గన్నవారం,గుడివాడ,మచిలీపట్నం.

ఈ మూడు నియోజకవర్గాల్లో గెలవడం ఇటు వైసీపీకి అటు టీడీపీకి ప్రతిష్టాత్మకం. ఇక వైసీపీ ఇప్పటివరకు పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మార్చగా ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ఖరారు చేయలేదు. టీడీపీ సైతం ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

గుడివాడ నుండి మాజీ మంత్రి కొడాలి నాని దాదాపు ఖరారు కాగా టీడీపీ నుండి వెనిగండ్ల రాములు పేరు వినిపిస్తోంది. ఇక మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పేర్ని కృష్ణమూర్తి, టీడీపీ నుండి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు వినిపిస్తోండగా గన్నవరం నుండి వైసీపీ టికెట్‌పై వల్లభనేని వంశీ, టీడీపీ టికెట్‌పై యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే గుడివాడ రాజకీయాలు హీటెక్కగా నాని వర్సెస్ చంద్రబాబు మధ్య గొడవ రచ్చరచ్చగా మారింది. ఈ మూడు చోట్ల ఎవరు గెలుస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -