వైఎస్ రాజశేఖర్ రెడ్డి..ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. పాదయాత్రతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు వైఎస్. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూసిన వైఎస్…ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్ సైతం పాదయాత్రతోనే ప్రజలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తోడ్పడింది వైఎస్ చేపట్టిన పాదయాత్ర.
దీనినే వెండితెరపై ఆవిష్కరించారు దర్శకుడు మహి వి రాఘవ. 2019లో యాత్రగా వచ్చిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహి వీ రాఘవ. యాత్ర సినిమాలో వైఎస్ జర్నీని చూపించిన దర్శకుడు యాత్ర 2లో వైఎస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలను అద్భుతంగా చూపించాడు.
వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి , జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా తెరకెక్కించారు. జగన్ బలమైన లీడర్ అని తాను చెప్పదలుచుకున్న పాయింట్‌ని ప్రేక్షకుల మైండ్‌లో ఫిక్స్ చేసేశాడు. స్ట్రాంగ్ లీడర్ ఎమోషనల్ జర్నీగా యాత్ర 2ను మలిచాడు దర్శకుడు. ప్రజల కోసం, ఇచ్చిన మాట కోసం జగన్ చేసిన పోరాటం, కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. మొత్తంగా యాత్ర 2 అభిమానులకు పండగలాంటి మూవీ.
