బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూల్ ఎంపీ పొతుగంటి రాములు బీజేపీలో చేరగా తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోగా బీజేపీ అభ్యర్థిగా పాటిల్ బరిలో దిగే అవకాశం ఉంది.తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపిన పాటిల్…ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఏ క్షణమైనా బీజేపీ లిస్ట్ రిలీజ్ కానుండగా తెలంగాణ నుండి 8 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి, నిజామాబాద్ – అరవింద్, కరీంనగర్ – బండి సంజయ్ ఉండగా చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్,హైదరాబాద్ – మాధవీలత, మహబూబ్‌నగర్ – డీకే అరుణ, నాగర్ కర్నూల్ – భరత్ ప్రసాద్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
