కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లి కవితే ఒప్పుకోవడం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్… కవితకు ఆమె ఇంట్లోనే విలువ లేదు అన్నారు. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదాను కేసీఆర్ ఇవ్వడం లేదు అన్నారు.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, స్లీపింగ్ ప్రెసిడెంటో నాకేం తెలుసు చెప్పాలన్నారు. ముందు ఆయన కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలి… నాకు ఎవరితో శతృత్వం లేదు.. వైరుధ్యం లేదు అన్నారు.కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని తెలిపారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు పర్యటన కొనసాగుతోంది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ నుంచి బందర్ కి రైలు కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
