కేటీఆర్ ది గంజాయి బ్యాచ్ అని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్.. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు, కేటీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు.
డ్రగ్స్ టెస్టుకు రమ్మంటే పారిపోయింది ఎవరు?.. కేటీఆర్ పార్టనర్, ఫ్రెండ్ కేదార్ మిక్స్డ్ డ్రగ్స్ తీసుకుని దుబాయ్ లో చనిపోయాడు అన్నారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా నేను తెప్పించాను అన్నారు. కేసీఆర్ చర్చకు వస్తే నేను సిద్ధం… బాత్రూంలు కడిగే వాళ్లతో చర్చకు నేను పోను అన్నారు. తనకు వ్యక్తులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నారు రేవంత్.
పోరాటం నా చివరి అస్త్రం… పదేళ్లలో బీఆర్ఎస్ సాధించలేనిది నేను సాధించాను అన్నారు. 2018లో కేసీఆర్ రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారు… 50 శాతం మించేది లేదంటూ బీసీ రిజర్వేషన్ పైన చట్టం చేశారు కానీ మేం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేసిన తర్వాత తెలంగాణలో తీసేయమని అడగాలి అన్నారు.
