- Advertisement -

విద్యావిధానంలో సమూల మార్పులు!

- Advertisement -

తెలంగాణ విద్యా విధానం పై సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని వెల్లడించారు రేవంత్.

నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి అని ఆకాంక్షించారు. గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయి అని… ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదు అన్నారు రేవంత్.

ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు .. వారిలో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు అన్నారు. విద్యా శాఖకు రూ. 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుంది అన్నారు సీఎం. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం అని తెలిపారు రేవంత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -