తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా సంచలన ఆరోపణలు చేశారు. రెడ్డి నేతలంతా కలిసి బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని… రేవంత్ మనుషులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రోహిన్ రెడ్డికి గన్ ఇచ్చి డెక్కన్ సిమెంట్స్ పై రేవంత్ బెదిరింపులకు పాల్పడుతున్నారని… బిగ్ షాట్స్‌ను వేం నరేందర్ రెడ్డి,రోహిన్ రెడ్డి వేధింపులు చేస్తున్నారని కొండా సుస్మితా ఆరోపించారు.
వాటాల్లో తేడా రావడంతో కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌తో రోహిన్ రెడ్డి పంచాయితీ వచ్చిందని తెలిపారు. సుమంత్‌ను అరెస్ట్ చేస్తే రోహిన్ రెడ్డి, సీఎంలను అరెస్ట్ చేయాలన్నారు సుస్మిత.
సుమంత్ గన్‌తో బెదిరించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో పోలీస్ కేసు నమోదు కాగా సుమంత్ అరెస్ట్‌కు కొండా సురేఖ ఇంటిపై మఫ్టీలో వచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకొని మీడియా ముందు రేవంత్‌ని కడిగిపారేశారు సుస్మిత.
