- Advertisement -

వీడియో..రీల్స్ చూస్తూ బస్సు నడుపుతూ!

- Advertisement -

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. మళవల్లి–మైసూరు మార్గంలో కేఎస్ఆర్టీసీ బస్సును నడుపుతూ డ్రైవర్ మొబైల్‌లో రీల్స్ చూస్తూ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు.

డ్రైవర్ మహేశ్ రద్దీగా ఉండే రహదారిపై బస్సు నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడాన్ని ప్రయాణికులు గమనించారు. ఈ నిర్లక్ష్య వైఖరితో బస్సు ఊగిసలాడుతూ నడవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు డ్రైవర్‌ను హెచ్చరించినప్పటికీ అతడు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేసే డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై కేఎస్ఆర్టీసీ అధికారులు స్పందించి, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతే ప్రధానమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -