వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ దర్శకుడు క్రిష్. కొంతకాలంగా డౌన్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్నారు క్రిష్. గత ఏడాది విడుదలైన ఘాటీ ఆశించిన ఫలితం రాకపోవడం, అలాగే పాక్షికంగా తెరకెక్కించిన హరిహర వీరమల్లు కూడా అనుకున్న స్థాయిలో నిలవకపోవడం ఆయన కెరీర్‌పై ప్రభావం చూపింది.
ఈ నేపథ్యంలో ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్న క్రిష్..మరోసారి డిఫరెంట్ జోనర్లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో ఏకంగా ఏడుగురు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వారి పేర్లు ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రస్తుతం క్యాస్టింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని సమాచారం.
ఈ సినిమా ట్రెక్కింగ్ బ్యాక్‌డ్రాప్‌లో, సర్వైవల్ థ్రిల్లర్ తరహాలో ఉండొచ్చని ప్రచారం. క్రిష్ ఎప్పుడూ రొటీన్ కథలతో కాకుండా వైవిధ్యమైన కాన్సెప్ట్స్‌ను ఎంచుకుంటారు. అందుకే ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.
