- Advertisement -

దారుణం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

- Advertisement -

హైదరాబాద్ అంబర్‌పేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులను రామ్ రాజ్, మాధవి, శశాంక్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు తమ నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.

పొరుగువారు అనుమానాస్పద పరిస్థితులను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల కుటుంబం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్థిక సమస్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ సంఘటన మళ్లీ గుర్తుచేసింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -