- Advertisement -

తుమ్మనపేటలో విజయ్-రష్మికా సందడి

- Advertisement -

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ రిసెప్షన్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ నెల 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

నిన్న ఈ జంట అల్లూ శిరీష్ ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు నాగర్‌కర్నూల్ జిల్లా, బాల్మూర్ మండలంలోని తుమ్మనపేట గ్రామానికి చేరుకుని, విజయ్ దేవరకొండ స్వగ్రామంలో కొత్తగా నిర్మించిన ఫార్మ్‌హౌస్‌లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు.

వారిని చూడటానికి అభిమానులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. కొత్త దంపతులను ఒక్కసారి చూడాలని పెద్ద ఎత్తున జనసందోహం కనిపించింది. రేపు ఈ జంట హైదరాబాద్‌కు తిరిగి వెళ్లి మరికొంతమందిని తమ రిసెప్షన్‌కు ఆహ్వానించనున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబాలి’ అనే పీరియడ్ వార్ యాక్షన్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 11, 2026న పలు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -