- Advertisement -

చిరు ఫ్యాన్స్ కోసం మెగా యూత్ ఫోర్స్!

- Advertisement -

చిరంజీవి అభిమానుల కోసం మెగా యూత్ ఫోర్స్ ను ప్రారంభించారు సుస్మిత కొణిదెల. మెగా అభిమానులను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ యూత్ ఫోర్స్ లక్ష్యం. ఈ యూత్ ఫోర్స్‌ నేషనల్ కన్వీనర్ గా బాబి ఏడిదకు బాధ్యతలు అప్పగించారు సుస్మిత.

అలాగే దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు సిద్ధమవుతోంది మెగా యూత్ ఫోర్స్. మెగా అభిమాన సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, సమాజ సేవ దిశగా వారి శక్తిని వినియోగించే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. బాబీ యెదిద నాయకత్వంలో “మెగా యూత్ ఫోర్స్” ఒక శక్తివంతమైన సేవా ఉద్యమంగా ఎదుగుతుందని సుష్మితా కొణిదెల విశ్వాసం వ్యక్తం చేశారు.

యువతను ఒకే దిశగా చేర్చి, సేవా భావంతో సమాజంలో మార్పు తీసుకురావడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా బాబీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -