- Advertisement -

రాత్రంతా తండ్రి శవం పక్కనే..హృదయ విదారకం!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. ఒక ఐదేళ్ల బాలుడు రాత్రంతా తన తండ్రి శవం పక్కనే గడపాల్సిన దారుణ పరిస్థితి చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తిని నరసింహులు మరియు మరో ముగ్గురు వ్యక్తులు క్రూరంగా హత్య చేసినట్లు సమాచారం. ఈ దారుణం గాంధీ కుమారుడు సందీప్ (5) కళ్లముందే జరిగిందని తెలుస్తోంది. తండ్రిని కోల్పోయిన చిన్నారి భయంతో రాత్రంతా అటవీ ప్రాంతంలోనే శవం పక్కన గడిపాడు.

ఉదయం అవగానే సందీప్ సుమారు 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ సమీప అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని టీచర్‌కు జరిగిన ఘటనను వివరించాడు. బాలుడి మాటలు విన్న టీచర్ వెంటనే అతడితో కలిసి ఘటనాస్థలికి వెళ్లి, గాంధీ శవాన్ని గుర్తించారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు.

ప్రాథమిక విచారణలో అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మృతుడి భార్య రఫాతి పరారీలో ఉండగా, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్నారి పరిస్థితి చూసి గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -