- Advertisement -

పాక్ క్రికెటర్‌కు ‘డ్రగ్ టెస్ట్’ పాజిటివ్..

- Advertisement -

పాకిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ (32) ప్రస్తుతం తీవ్ర చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సేకరించిన నమూనాల ఆధారంగా ఆయన వినోదపు మాదక ద్రవ్యాలు (Recreational Drugs) ఉపయోగించినట్లు తేలింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (PCB) అధికారికంగా తెలియజేయడంతో, పీసీబీ విచారణ ప్రారంభించింది.

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ నవాజ్ పాల్గొన్నారు. ఆ సమయంలో సేకరించిన శాంపిల్స్‌లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇంగ్లాండ్‌లో మే 26 నుండి జరగబోయే ‘టీ20 బ్లాస్ట్’ టోర్నీలో సర్రీ జట్టు తరపున ఆడేందుకు నవాజ్ ఒప్పందం చేసుకున్నారు. పీసీబీ ఎన్ఓసీ (NOC) కూడా ఇచ్చింది. అయితే, తాజా ఉత్ప్రేరక పరీక్ష ఫలితాల నేపథ్యంలో ఈ ఒప్పందం రద్దయింది.

ఐసీసీ నుండి మాకు సమాచారం అందింది, ప్రస్తుతం నిబంధనల ప్రకారం విచారణ ప్రక్రియ జరుగుతోంది. దీనికి సంబంధించిన నివేదికను ఐసీసీకి అందజేస్తాము పీసీబీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తరపున ఆడుతున్నారు. ఇటీవలే రావల్పిండితో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆయన బరిలోకి దిగారు. అయితే, ఐసీసీ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఆయన అంతర్జాతీయ కెరీర్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ ఆరోపణలు రుజువైతే ఆయనపై నిషేధం విధించే అవకాశం ఉంది.

ఈ విషయంపై ఐసీసీ ప్రస్తుతానికి అదనపు వ్యాఖ్యలు చేసేందుకు నిరాకరించింది. విచారణ పూర్తయిన తర్వాతే నవాజ్ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -