యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలోతెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మిస్టరీ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). ఈ ఏడాది చివర్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు రాబోతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం.. తాజాగా బిజినెస్ పరంగా ట్రేడ్ వర్గాల్లో ఒక రేంజ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నప్పటికీ.. తాజాగా దీనికి సంబంధించిన శాటిలైట్ హక్కులు (Satellite Rights) భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
పాపులర్ టెలివిజన్ నెట్‌వర్క్ ‘జీ తెలుగు’ (ZEE Telugu) భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకుందని సమాచారం. కథపై ఉన్న నమ్మకం, అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్రాండ్ వాల్యూ కారణంగానే జీ యాజమాన్యం పోటీపడి మరీ ఈ డీల్‌ను క్లోజ్ చేసినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ నుండి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన (Official Announcement) వచ్చే అవకాశం ఉంది. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఈ స్థాయి బిజినెస్ నమోదు చేయడం అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపింది.
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) బ్యానర్లపై ఈ సినిమా సంయుక్తంగా అత్యంత గ్రాండ్‌గా నిర్మాణమవుతోంది. బాపినీడు ఈ చిత్రానికి ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ (Sparsh Shrivastava) ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. సీనియర్ నటుడు జయరామ్, కామెడీ కింగ్ సత్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath) ఈ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబర్ 2026 లో ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
