భారత సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఆయన ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 16,000 పరుగులు పూర్తి చేసుకుని సరికొత్త మైలురాయిని అందుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ శర్మకు అదృష్టం కలిసి రాలేదు. ఛేజింగ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్, శుభ్‌మన్ గిల్‌తో జరిగిన రనౌట్ మిస్ కారణంగా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.
దీంతో రోహిత్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడారు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ ఆయన ఒక పెద్ద మైలురాయిని అధిగమించారు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 16,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్… భారత క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించారు.
అంతేకాకుండా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆల్‌టైమ్ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కాలిస్‌ను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై మంచి ఇన్నింగ్స్ ఆడాలని భావించిన రోహిత్.. కేవలం 16 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి రనౌట్ రూపంలో వెనుతిరిగారు.
భారత్ విజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మతో జరిగిన రనౌట్ మిస్అండర్స్టాండింగ్ గురించి మాట్లాడారు. రోహిత్ శర్మ ఆ తర్వాత రీప్లే చూశారని అంతా బాగానే ఉందని అన్నట్లు గిల్ వెల్లడించారు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ఆయన ఇలాగే రనౌట్ అయ్యారు అని మ్యాచ్ ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్ పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించారు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరఫున ఓపెనర్‌గా వచ్చిన గిల్, చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్ శర్మ వికెట్ త్వరగా పడిపోయినప్పటికీ గిల్ కేవలం 66 బంతుల్లో 84* పరుగులు చేసి భారత్‌ను గెలిపించడమే కాకుండా సిరీస్‌లో ఆధిక్యాన్ని అందించారు.
