- Advertisement -

రేపు తెలంగాణ‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. హన్మకొండ జిల్లాలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను ఆయన పరామర్శించనున్నారు.

ఇటీవల నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. బాలుడి పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు హన్మకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకుని బాలుడిని కలుసుకోనున్నారు.

పవన్ కళ్యాణ్ పర్యటన వార్త తెలియడంతో జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బాలుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులకు అండగా నిలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఇటీవల పవన్ తెలంగాణలో పర్యటించడం ఆయన సభకు పోలీసులు అనుమతివ్వకపొవడంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్- జనసేన నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరగా తాజాగా పవన్ మరోసారి తెలంగాణకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -