భారత ప్రభుత్వం టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. మొబైల్ టవర్ సిగ్నల్ లేని చోట కూడా ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఈ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయ వాతావరణానికి తగ్గట్లుగా దానిని రూపొంది చినట్లు సంస్థ పేర్కొంది. ఎక్కువ సమయం బ్యాటరీ వచ్చేలా, తీవ్ర వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేలా, వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యంతో ఫోన్‌ను రూపొందించినట్లు సంస్థ వివరించింది.
సెల్ ఫోన్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీలుగా భారత ప్రభుత్వం టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. అడవులు, సముద్ర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, విపత్తులు సంభవించిన చోట ఈ ఫోన్‌తో మాట్లాడొచ్చు. దీని ధర రూ.1,34,166. దీనిని సొంతం చేసుకోవాలంటే ముందుగా కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేలా, వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యంతో ఫోన్‌ను రూపొందించినట్లు సంస్థ వివరించింది. భూ స్థిర ఉపగ్రహాల ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సంస్థ ఇన్మార్సాట్ సహభాగస్వామ్యం తో ఈ శాటిలైట్ ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. అన్ని రకాల పన్నులతో కలుపుకొని ఈ ఫోన్ ధర రూ.1,34,166గా నిర్ణయించారు.
అయితే, మన దేశంలో శాటిలైట్ ఫోన్‌ను సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కొనుగోలు చేసి వాడుకోవడం కుదరదు. ఫోన్ కొనుగోలు చేయాలన్నా, వాడాలన్నా టెలికమ్యూనికేషన్స్ శాఖ అనుమతి తప్పనిసరి. రక్షణ శాఖ, సముద్ర రవాణా, విపత్తు నిర్వహణ బృందాలు, గనుల పరిశ్రమ, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, సాహస యాత్రికులు వంటి వారిని దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ ఫోన్‌ను రూపొందించారు. శాటిలైట్ ఫోన్ సర్వీసు గురించి మరిన్ని వివరాలకోసం దగ్గరలోని సంస్థ కార్యాలయాలను సందర్శించాలని లేదా 9768866652కు కాల్ చేయాలని కోరింది. కాగా, బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 99,000 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. మరిన్ని టవర్లను కూడా ఏర్పాటు చేయనుంది.
