- Advertisement -

బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు అనుమతి..

- Advertisement -

బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. పోలీసులు అనుమతి నిరాకరించటంతో ఈ సదస్సు నిర్వహణ కోసం హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇవ్వటంతో శనివారం సరూర్ నగర్ స్టేడియంలో ఈ సభ నిర్వహణకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని యువతకు ఇచ్చిన హామీలు.. ఉద్యోగాల పైన ఈ సభ ద్వారా ప్రశ్నించాలని నిర్ణయించింది.

బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహించుకోవచ్చని తెలిపింది. కొన్ని షరుతులు విధించింది. సభ రోజు హైవేను బ్లాక్ చేయొద్దని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించొద్దని పేర్కొంది. పోలీసుల సూచనలు పాటించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా, ఈ సభ కోసం కొన్ని రోజులుగా నిర్వాహకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. శాంతి భద్రతలకు సమస్య ఏర్పడుతుందనే కారణం తో అనుమతి నిరాకరించారు. దీంతో.. నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు.

ఈ సదస్సులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్ర యువతకు అనేక హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు చెబుతున్నారు. ఆ సమయంలో సరూర్‌నగర్ స్టేడియం నుంచే వారు యూత్ డిక్లరేషన్ ప్రకటించారని వెల్లడిస్తున్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో వాగ్దానాలను యువతకు ఇచ్చారని అంటున్నారు. నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వారిని మోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేయని అంశాన్ని ప్రధానంగా నిలదీయనున్నారు. దీంతో.. ఈ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గులాబీ నేతలు నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -