- Advertisement -
రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి అధిక లాభాలు ఆశ చూపి ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.33 లక్షలు పెట్టుబడి పెట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి.అపెక్స్ డిజిటల్ క్యాపిటల్ పేరుతో వాట్సాప్ గ్రూపులో చేర్చారు నిందితులు.
ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టాలని ప్రలోభాలు పెట్టగా వారు పంపిన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు బాధితుడు. పలు దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతా నుండి రూ.33 లక్షల బదిలీ చేశారు.
ఆ తర్వాత ఐపిఓ పెట్టుబడి పేరుతో నిందితులు మరింత డబ్బు డిమాండ్ చేయడంతో అనుమానంతో విత్ డ్రా చేయడానికి ప్రయత్నించారు. డబ్బులు రాకపోవడంతో మోసపోయాను గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
