- Advertisement -

చైనా ఓపెన్ సిరీస్ నుంచి నిష్క్ర‌మించిన పీవీ సింధు..

- Advertisement -

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత పోరు ముగిసింది. భారత్‌ తరఫున పోరులో ఉన్న పీవీ సింధు కూడా క్వార్టర్స్‌ నుంచే వెనుదిరిగింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సింధు 11-21, 10-21తో గావొ ఫాంగ్‌జీ(చైనా) చేతిలో ఓడిపోయింది. 38నిమిషాల పాటు మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. క్వార్టర్స్‌ నుంచే సింధు కూడా నిష్క్రమించడంతో చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత పోరుకు తెరపడినట్లయింది.

ఇప్ప‌టికె ఇత‌ర భార‌త ష‌ట్ల‌ర్లు సైనా నెహ్వాల్‌, హెచ్ఎస్ ప్ర‌ణ‌య్‌లు ప్రీక్వార్ట‌ర్‌లోనే నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు 2వ స్థానంలో కొనసాగుతుండగా.. ఫాంగ్‌జీ ర్యాంకు 89. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సైనా, ప్రణయ్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా కిదాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నీలో పాల్గొనలేదు.

గ‌త మూడు వారాల నుంచి డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచ్ ఓపెన్‌, నాగ్‌పూర్‌లో జాతీయ ఛాంపియ‌న్‌షిప్‌ల‌లో ఆడిన సింధు, గావో ఫాంగ్జీతో జ‌రిగిన మ్యాచులో కొంత ఇబ్బందిప‌డిన‌ట్లుగా క‌నిపించింది. చిన్న చిన్న త‌ప్పులు చేయ‌డం, ప్ర‌త్య‌ర్థిని తిక‌మ‌క పెట్ట‌డంలో సింధు ఇబ్బందులు ఎదుర్కున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -