- Advertisement -

కాపు రిజ‌ర్వేష‌న్‌ల‌పై బాబు మోసం బ‌ట్ట‌బ‌య‌లు…

- Advertisement -

ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డిన‌ప్పుడు ఇష్యూను డైవ‌ర్ట్ చేయ‌డంలో మ‌న బ్రీఫ్డ్ బాబు త‌రువాతే ఎవ‌రైనా. 2014 ఎన్నిక‌ల్లో అమలు సాధ్య‌కాని కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల హామీని ఇచ్చి ల‌బ్ధిపొందారు బాబుగారు. తానిచ్చిన హామీ అమలు సాధ్యం కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా జనాలను మాయ చేసి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి రాగానే హామీని పక్కన పడేశారు.

పోల‌వ‌రం ఇష్యూ మీద వ‌స్తున్న ఆరోప‌న‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు, కాపుల‌నుంచి వ‌స్తున్న వ‌త్తిడిని త‌ట్టుకోలేక 5 శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లును అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంప‌నున్నారు. అయితే తాజాగా బాబుకు పెద్ద షాక్ ఇచ్చారు ప్ర‌ధాని మోదీ.

గుజరాత్ ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబుకు షాక్ ఇవ్వటం గమనార్హం. గుజరాత్ ఎన్నికల్లో మోడి మాట్లాడుతూ, ‘50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామని ఎవరైనా చెబితే అది తప్పుడు హామీ అవుతుంది’ అంటూ ప్రకటించారు. అంటే అర్ధమేంటి? ఏపిలో ఇప్పటికే రిజర్వేషన్ల శాతం 50 శాతం ఉంది. తాజాగా కాపులకు ఇచ్చిన 5 శాతంతో అది 55 శాతానికి చేరుకుంది. అంటే మోడీ మాటల ప్రకారం చంద్రబాబుది తప్పుడు హామీనే కదా?

అదేవిధంగా, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సుప్రింకోర్టు విధించిన యాబైశాతం పరిమితిని దాటే ఉద్దేశ్యం తమకు లేదని కూడా తేల్చి చెప్పారు. మోడి తాజా ప్రకటన ప్రకారం ఏపి అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం అమోదించే అవకాశాల్లేవు. ఏపికి వర్తించే విధానమే తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లకూడా వర్తిస్తుందని మోడి చెప్పకనే చెప్పారు.

రిజర్వేషన్ల కోసమంటూ ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టిన ఆందోళనను తట్టుకోలేక మంజూనాధ కమీషన్ వేశారు. తీరా ఛైర్మన్ మంజూనాధ నివేదిక ఇవ్వకుండానే సభ్యులిచ్చిన నివేదిక అంటూ ఓ నివేదికను మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు. దాన్నే అసెంబ్లీలో కూడా పెట్టి తీర్మానం చేయించి కేంద్రానికి పేంపాశారు. తన భారాన్ని కేంద్రంపై నెట్టేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా లబ్ది పొందుదామన్న చంద్రబాబు ఆలోచ‌నకు మొదట్లోనే గండికొట్టారు మోదీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -