స్పైడర్ సినిమా విజయం తర్వాత ప్రిన్స్ మహేశ్‌బాబు ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పనులతో బిజీగా ఉన్న అతడు కొంచెం విరామం తీసుకున్నాడు. తన ఫేవరేట్ వాణిజ్య ప్రకటనగా నిలిచిన తమ్సప్ యాడ్‌లో మళ్లీ నటిస్తున్నాడు. భరత్ అను నేను సినిమా షూటింగ్‌కు కొంచెం విరామం ఇచ్చి విదేశాల్లో ఆ యాడ్ కోసం నటిస్తున్నాడు.
మహేశ్‌బాబు.. రణ్వీర్తో కలిసి లొకేషన్లో ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. మహేశ్ మళ్లీ క్యూట్‌గా కనిపిస్తున్నాడు. కొంచెం సన్నబడి యాడ్ కోసం నటిస్తున్నాడు. మళ్లీ ఏదైనా అదరగొట్టే మాదిరి సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించాడు. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.
అయితే మహేశ్ నటిస్తున్న ‘భరత్ అను నేను’లో రాజకీయాల గురించి ఉండొచ్చని తెలుస్తోంది. డిసెంబర్ 31వ తేదీన సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ ఎండింగ్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
