అఖిల్ చిత్రంతో అఖిల్ కు ఎంత పేరొచ్చింది,ఎంత రాలేదు అన్నది పాయింట్ కాదు గాని….ఈసినిమా మ్యూజిక్ విషయంలో వర్క్ చేసిన ముగ్గురిలో ఎవెరవ్వరికీ ఎలాంటి పేరొచ్చిందో ఇపుడు తెలుసుకుందాం.
వినాయక్ మార్క్ కమర్షియల్ అంశాలతో అఖిల్ రూపొందిన విషయం మనకు తెలిసిందే..అయితే ఈ సినిమా మ్యూజిక్ పరంగా భాగా నోటెడ్ అవుతోంది.పడేశావే పడేశావే.. అనే సాంగ్ అఖిల్ హీరో డెబ్యూ మూవీలో ఓ మెలోడీ గా పేరుగాంచింది.ఇక సినిమాలో మిగతా పాటలు ఉన్నప్పటికీ ఈ మెలోడీకి అధికంగా స్పందన లభిస్తోంది. అన్ని పాటలు బాగున్నప్పటికీ.. పడేశావే సాంగ్ మెలోడీ ట్రాక్ కావడంతో జనాల్లోకి వెళ్లిపోయింది.
అయితే ఈసాంగ్ ను తమన్ కంపోజ్ చేశాడు. ముందుగా అన్ని పాటలకు పాస్ట్ బీట్ ఇచ్చే తమన్నే అనుకున్నా.. తర్వాత తమన్ తో పాటు అనూప్ రూబెన్స్ కూడా అఖిల్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.అది కూడా నాగ్ కోరికతో. కాని తనకు ఇచ్చిన ఒకే ఒక్క పాటతో తమన్ ఇరగదీసేశాడనే పేరు కొట్టేశాడు. తమన్ నుంచి ఇంతటి క్యూట్ సాంగ్ రావడం మనం ఇక్కడ గమనించాలి.
ఈపాటతో పాటు మిగిలిన పాటలన్నీ కాస్త ఫాస్టు బీట్స్ గా ఉండడంతో అందరికీ ముందుగా ఈసాగే కనెక్ట్ అయింది.కాకపోతే నాలుగు పాటలు కంపోజ్ చేసిన అనూప్ కంటే.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మణిశర్మ ను కూడా లెక్కలోకి తీసుకోకుండా…అంతా తమన్ పేరే స్మరించడం అనూప్ నొచ్చుకునేలా చేసిందని చెబుతున్నారు.
