శ్రీమంతుడు సినిమా తర్వాత.. కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.. ప్రిన్స్ మహేష్ బాబు. క్రేజీ కాంబినేషన్లతో.. సినిమా ప్రారంభానికి ముందే హైప్ క్రియేట్ చేస్తూ.. తన రేంజ్ పెంచుకుంటున్నాడు.
త్వరలో పూరీ జగన్నాథ్ తో చేయబోయే సినిమాపై కూడా అప్పుడే ప్రచారం మొదలైంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఓ వార్త నిజమో కాదో ఇంత వరకూ క్లారిటీ లేదు. కానీ.. టాలీవుడ్ లోనే కాదు.. ఇండియా వైడ్ గా ఈ గాసిప్ క్యూరియాసిటీ పెంచేస్తోంది.
మహేష్ తో పోకిరి, బిజినెస్ మెన్ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. త్వరలో మల్టీ స్టారర్ గా ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అందులో… ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ ను ఓ కీలక రోల్ కు ఫైనల్ చేసే ప్రయత్నాల్లో పూరీ సీరియస్ గా వర్కవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
భారీ ఖర్చుతో.. ఇంటర్నేషనల్ లెవల్ లో ఈ సినిమా రూపొందనున్నట్టు పూరీ ఇంతకుముందే చెప్పాడు. అందుకు తగ్గట్టే.. జాకీ చాన్ ను మూవీలోకి తీసుకుంటే.. హైప్ మరింత పెరుగుతుందని పూరీ నమ్ముతున్నాడట. స్క్రిప్ట్ పై కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న పూరీ.. ఎలాగైనా జాకీచాన్ ను టాలీవుడ్ రప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట.
బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ కు.. టాలీవుడ్ లో సూపర్ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు పూరీ. ఇప్పటికీ సోనూసూద్ తో పూరీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా… సోనూ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో.. జాకీచాన్ నటిస్తున్నాడు. అదే పరిచయంతో.. మహేష్ సినిమాలో జాకీని తీసుకుందామని పూరీ ప్లాన్ చేస్తున్నాడని టాక్. చూడాలి.. ఈ ప్లాన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో!
