- Advertisement -

ఈవీఎంల గురించి షాకింగ్ న్యూస్‌..

- Advertisement -

చత్తీష్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్తాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల హాడావుడి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వీవీపీఏటీ ఆధారిత ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ ఈవీఎమ్‌ల‌ను ఉప‌యోగించ‌నుంది. అయితే తాజాగా ఈవీఎంల హ్య‌కింగ్ గురించి అస‌క్తిక‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది.

దేశీయంగా అందుబాటులో ఉన్న ఈవీఎంలను హ్యాక్ చేయటం పెద్ద కష్టమేమీ కాదంటూ.. అందుకున్న మార్గాన్ని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ సైంటిస్టులు కనుగొన్నట్లుగా పేర్కొంది బీబీసీ న్యూస్ రిపోర్టు.మొబైల్‌ టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల ఎన్నికల ఫలితాలను యూఎస్‌ యూనివర్సిటీ సైటింస్ట్‌లు తారుమారు చేయొచ్చని చెప్పారు.

మిషన్ల వెనుక డిస్ ప్లే ఎలా ఉంటుందో అచ్చం అదే మాదిరి డిస్ ప్లే బోర్డును రూపొందించినట్టు ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రాజెక్టు భాగమైన ప్రొఫెసర్ జే అలెక్స్ హాల్ట్రర్ మ్యాన్ వెల్లడించారు. ఈ డిస్ ప్లే బోర్డు.. మిషను చూపించే మొత్తం ఓట్లను కొల్లగొట్టి.. వాటి స్థానంలో వేరేవి చూపించేలా రూపొందించినట్లుగా చెప్పారు.

భారత ఈవీఎంలను ప్రపంచంలోనే అత్యంత టాంపర్ ఫ్రూప్ ఓటింగ్ మిషన్లుగా అభివర్ణించారని.. ఈ డివైజ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ అసలు ట్యాంపర్ చేయటానికి వీలు ఉండదని.. ప్రజలు వేసే ఓట్లను.. దాని కోసమే రూపొందించిన కంప్యూటర్ చిప్స్ లో స్టోర్ చేస్తారని తెలిపారు. అయితే కానీ భారత ఎన్నికల కమిషన్‌ వాడే ఈవీఎంలను కూడా హ్యాక్‌ చేసే అవకాశముందని మిచిగాన్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు తేల్చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -