- Advertisement -

రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో హీరోగా రామ్ చ‌ర‌ణ్,విల‌న్‌గా ఎన్టీఆర్‌?

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న త‌రువాత సినిమాను ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్‌ల‌తో తీస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా షూటింగు కోసం ఎన్టీఆర్ .. చరణ్ 200 రోజులను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారు..?వారి పాత్రల తీరు తెన్నులపై అభిమానుల ఆసక్తి పెరిగిపోయింది.ఈ విషయాల గురించి కొన్ని వార్తలు బయటకొచ్చాయి. తాజాగా మరోవార్త హల్చల్ చేస్తోంది. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే..? ఈ సినిమాలో ఎన్టీఆర్ ని విలన్ గా చూపించబోతున్నారని సమాచారం.

రామ్ చరణ్ ని హీరోగా పోట్రేట్ చేయనున్నారు. ఎన్టీఆర్-చరణ్ ల మధ్య పోరు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. సినిమా మొత్తం వీరిద్దరి మీదే నడుస్తుందట. పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్, అతడిని మట్టుబెట్టాలని చూసే హీరో.. ఇదే రాజమౌళి ఆలోచన అని సమాచారం. రాజమౌళి తన సినిమాలలో హీరోల కంటే విలన్ ని బలంగా చూపిస్తారనే విషయం తెలిసిందే.ఇప్పటికే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు. అయితే అందులో హీరో కూడా ఎన్టీఆరే కావడంతో అభిమానులు సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు చరణ్ కి విలన్ గా ఎన్టీఆర్ ని చూపించాలనే ఆలోచనని అభిమానులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనే విషయం ఆలోచించాల్సిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -