- Advertisement -

త్వరలో టెండర్లు పిలవాలన్న సిఎం

- Advertisement -

తెలంగాణ జిల్లాల్లో కొత్తగా మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులు రానున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలలో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణం రెండేళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదేశించారు.

శుక్రవారం బాగా పొద్దుపోయిన తర్వాత సిఎం ఈ ఆసుపత్రులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల మాదిరిగా ఈ మూడు నగరాల్లోనూ ఆసుపత్రులుండాలని ఆయన ఆదేశించారు. ఈ ఆసుపత్రుల్లో 700 పడకలు ఉండాలని, అందులో 500 పడకలు మల్టీ స్పెషాలిటీకి మిగిలినవి మహిళలు, చిన్నారుల కోసం కేటాయించాలని సూచించారు.

వ్యాస్కోప్ సహాయంతో సాంకేతికంగా డిజైన్లు రూపొందించాలని సిఎం చెప్పారు. తెలంగాణలో నిర్మించనున్న కొత్త ఆసుపత్రులకు నెదర్లాండ్ కు చెందిన రాబో బ్యాంకు ముందుకు వచ్చింది. ఈ బ్యాంకు ఆసుపత్రుల నిర్మాణం, అందుకు అయ్యే వ్యయం వంటి అంశాల్లో భాగస్వామ్యమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -