గుజరాత్‌లోని స్టానిక కోర్టులో శనివారం ఉదయం అనుకోని సంఘటన ఒకటి జరిగింది.సురేంద్రనగర్ జిల్లాలోని చోటిల్లా కోర్టులో ఓ కేసుకు సంబంధించి వాదోపవాదనలు జరుగుతుండగా ఊహించని అతిథి వచ్చి వారిని పలకిరచండంతో అక్కడ ఉన్నవారు షాక్ గురైయ్యారు.ఇంతకి ఆ అతిథి ఎవరనుకుంటున్నారు..చిరుత పులి.చోటిల్లా కోర్టు అటవి ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. శనివారం ఉదయం యథావిధిగా కోర్టు కార్యక్రమాలు జరుగుతుండగా సడన్‌గా కోర్టు లోపలికి చిరుత ప్రవేశించింది.
మొదట పులి వచ్చిన విషయాన్ని ఎవరు గుర్తించలేదు.కొందరు పులిని చూడగానే గట్టిగా ఆరవడంతో కోర్టులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే చిరుతను చూసి అవాక్కయిన న్యాయమూర్తి, లాయర్లు, ఇతర సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అనంతరం పులిని లోపలే ఉంచి తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
- పాండ్యాతో డేటింగ్ ప్రచారంపై అమీషా పటేల్ ఏమన్నారంటే..?
- బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభం
- అశ్లీల పరిశ్రమను చట్టబద్ధం చేయాలని ఉక్రెయిన్ యోచన!
- కొంత వరకే కొత్త మ్యాప్‌నకు మద్దతు: భారత్
