2014 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌కి సన్నిహితులైన కొంతమంది నాయకులు వైఎస్ జగన్‌కి అండగా నిలబడలేకపోయారు. అయితే 2019 ఎన్నికల సమయానికి మాత్రం ఈ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయని తెలుస్తోంది. వైఎస్సార్‌కి సైన్యంలాంటి నాయకులు అందరూ కూడా మొదటి నుంచీ టిడిపికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినవాళ్ళే. అయితే అలాంటి నాయకుల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం విలువలకు తిలోదకాలిస్తూ నిస్సిగ్గుగా చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నారు.
కాంగ్రెస్-టిడిపిల అపవిత్ర పొత్తుకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడుతూ ఉన్నారు. అదే కోవలో త్వరలోనే వైఎస్సార్‌కి సన్నిహితుడు అయిన కెవిపి రామచంద్రారావు కూడా కాంగ్రెస్ పార్టీని వీడనున్నాడు. కెవిపితో కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా టచ్‌లో ఉన్నారని కెవిపి సన్నిహితులు చెప్తున్నారు. అలాంటి నాయకులు అందరినీ కలుపుకుని త్వరలోనే వైకాపాలో చేరనున్నాడు కెవిపి. ఒకవేళ పార్టీలో చేరకపోయినా కూడా వైఎస్సార్ సైన్యంలాంటి చాలా మంది సీనియర్ నాయకులను వైకాపాకు మద్దతుగా 2019 ఎన్నికలకు సమాయాత్తం చేయనున్నాడు కెవీపీ. 2019లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా బాబుకు వ్యతిరేకంగా దశాబ్ధాలుగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ వైకాపాకు మద్దతు తెలిపేలా కెవిపి వ్యూహరచన చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు దోపిడీ పాలనకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ఈ నాయకులందరూ వైకాపాకు మద్దతుగా నిలబడనున్నారన్న వార్తలు వైకాపా అభిమానులకు ఉత్సాహాన్నిస్తున్నాయి.
- బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ విజయం..
- విశాఖ – బెంగళూరు వందేభారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్, రూట్ ఇలా..
- అరుణాచలం వచ్చే భక్తులకు కొత్త నిబంధనలు.. మోక్ష మార్గంలో వారికే అనుమతి..
- ఇక్కడకు రావద్దు.. విజయ్ కు డీకే శివకుమార్ విజ్ఞప్తి.. ‘జననాయగన్’ నిలిపివేత
- కోర్టుకు హాజరైన కేటీఆర్..ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
- జగన్ రాకతో పోటెత్తిన ఉత్తరాంధ్ర.. ఆంక్షలు చేధించి
