- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలుగు మార్కెట్ మీద ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె నటించిన మణికర్ణిక సినిమా ట్రైలర్‌ను తెలుగులో విడుదల చేసింది. ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో హిందీలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను తెలుగులో కూడా విడుదల చేసింది కంగనా.
ఈ సినిమాకు మొదట మన తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. తరువాత కంగనాకు క్రిష్‌కు మధ్య విభేదాలు రావడంతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మిగత సినిమాకు కంగనా రనౌతే దర్శకత్వం వహించింది. దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు.ఇక జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
- ప్రొస్టేట్ క్యాన్సర్..ఈ అవగాహన తప్పనిసరి!
- మాజీ ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య!
- పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
- ఆ విషయంలో ‘పెద్ది’ డైరెక్టర్ అసంతృప్తి!
- కొత్త పింఛన్లు.. కంచికేనా?
