- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలుగు మార్కెట్ మీద ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె నటించిన మణికర్ణిక సినిమా ట్రైలర్‌ను తెలుగులో విడుదల చేసింది. ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో హిందీలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్‌ను తెలుగులో కూడా విడుదల చేసింది కంగనా.
ఈ సినిమాకు మొదట మన తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. తరువాత కంగనాకు క్రిష్‌కు మధ్య విభేదాలు రావడంతో క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మిగత సినిమాకు కంగనా రనౌతే దర్శకత్వం వహించింది. దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించారు.ఇక జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్‌ను కొట్టి చంపిన భార్య!
- బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ అండ
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
