- Advertisement -
ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ(89) మృతి చెందారు. గత కొద్ది రోజులు నుంచి ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సభ్యులలో ఒకరు తెలిపారు. శకుంతలమ్మ ఈ రోజు(సోమవారం) ఉదయం 7 గంటలకు మరణించారు.
శకుంతలమ్మ మరణవార్తపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం ఇక్కడ లేరని తెలుస్తోంది. ఓ సంగీత కచేరిలో భాగంగా ఆయన లండన్ వెళ్లారని సమాచారం. ఆయన ఇండియాకు తిరిగి రాగనే అంత్యక్రియలు జరగనున్నాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వస్థలం నెల్లూరు కావడంతో ఆమె అంత్యక్రియలు అక్కడే జరగనున్నాయి.
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
