- Advertisement -
జమ్మూకశ్మీర్లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్దంపూర్ జిల్లా మజాల్తా సమీపంలో అదుపు తప్పిన బస్సులోయలోకి దూసుకపోయింది. ఈ ప్రమాందంలో ఆరుగురు మృతి చెందగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. సురిన్సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో కారు డ్రైవరు స్పృహతప్పి పడిపోయాడని, అతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడని జమ్మూ పోలీసులు చెప్పారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు.
