టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా షూటింగ్‌కు కాస్తా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మహేశ్, తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పటికే సినిమాలోని ఫస్ట్ లుక్‌తో పాటు, మహేశ్ పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్ బిట్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆప్డేట్ బయటికి వచ్చింది.
మహర్షి సినిమా టీజర్ డేట్‌ను లాక్ చేశారు చిత్ర యూనిట్. ‘మహాశివరాత్రి’ సందర్భంగా మార్చి 4వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందని అంటున్నారు. ఇక సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటిస్తోంది. అల్లరి నరేష్ సినిమాలో మహేశ్ స్నేహితుడుగా నటిస్తున్నాడు.
- ‘పెద్ది’లో జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
- టీడీపీ నేతపై భూకబ్జా ఆరోపణలు..
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
