Sunday, May 12, 2024
- Advertisement -

అట్ట‌హాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌ ప్ర‌దానం

- Advertisement -

భార‌త‌దేశ సినీ ప‌రిశ్ర‌మ‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. ఈ అవార్డులు ప్ర‌తిభ‌కే ప‌ట్టం క‌డుతాయి. అందుకే ఈ అవార్డుల‌పై సినీ ప్ర‌ముఖుల‌కు ఎంతో ప్ర‌త్యేకం. ప్ర‌తి ఏడాది అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ అవార్డులు అందిస్తున్నారు. ద‌క్షిణ‌, ఉత్త‌ర భార‌త‌దేశ ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి విడివిడిగా ఈ వేడుక జ‌రుగుతుంటుంది. గతేడాది జూన్‌లో 64వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2017 కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఇక జనవరి 20వ తేదీ 2017 సంవత్సరానికిగాను 63వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ఆదివారం (జనవరి-21)న ముంబయిలో జరిగింది. బాలీవుడ్‌కి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన ఈ వేడుక‌లో సినిమాలు, నటులు, ఇతర విభాగాలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. ఆయన ఆప్తమిత్రుడు, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఈ అవార్డు వేడుక‌లో వివిధ భాగాల‌కి సంబంధించి ప్ర‌క‌టించిన‌ అవార్డుల లిస్ట్ ఇలా ఉంది

ఉత్తమ చిత్రం: హిందీ మీడియం
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్ అవార్డ్): న్యూటన్
ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం)
ఉత్తమ నటి: విద్యాబాలన్ (తుమ్హారి సులు)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ అవార్డ్): రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్ అవార్డ్): జైరా వాసిం (సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ దర్శకత్వం: అశ్వినీ అయ్యర్ తివారీ (బరేల్లీ కి బర్ఫీ)
ఉత్తమ ఆరంగేట్ర దర్శకురాలు: కొంకణ సేన్‌శర్మ (ఎ డెత్ ఇన్ ద గంజ్)
ఉత్తమ సహాయ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (బరేల్లీ కి బర్ఫీ)
ఉత్తమ సహాయ నటి: మెహెర్ విజ్ (సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ డైలాగ్ రచయిత: హితేశ్ కేవాల్య (శుభ్ మంగళ్ సావ్‌ధాన్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: సుభాశిష్ భుటియాని (ముక్తి భవన్)
ఉత్తమ ఒరిజనల్ స్టోరీ: అమిత్ న్యూటన్ (న్యూటన్)
ఉత్తమ నటుడు (షార్ట్ ఫిల్మ్): జాకీ ష్రాఫ్ (ఖుల్జీ)
ఉత్తమ నటి (షార్ట్ ఫిల్మ్): షెఫాలీ షా (జ్యూష్)
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (పీపుల్స్ ఛాయిస్ అవార్డ్): అనాహత్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (ఫిక్షన్): జ్యూస్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (నాన్ ఫిక్షన్): ఇన్విజబుల్ వింగ్స్
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (జగ్గా జాసూస్)
ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రీతమ్ (జగ్గా జాసూస్)
ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్ (రోక్ నా రుకే నైనా – బద్రీనాథ్ కి దుల్హానియా)
ఉత్తమ గాయని: మేఘనా మిశ్రా (నచిది ఫిరా – సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ లిరిక్స్: అమితాబ్ బట్టాచార్య (ఉల్లు కా పట్టా – జగ్గా జాసూస్)
జీవితకాల సాఫల్య పురస్కారం: మాలా సిన్హా, బప్పి లహరి
ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ, రూయెల్ డౌసన్ వరిందని
ఉత్తమ యాక్షన్: టామ్ స్ట్రూథెర్స్ (టైగర్ జిందా హై)
ఉత్తమ ఛాయాగ్రహణం: సిర్షా రాయ్ (ఎ డెత్ ఇన్ ద గంజ్)
ఉత్తమ ఎడిటింగ్: నితిన్ బైద్ (ట్రాప్డ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: పారుల్ సోంధ్ (డాడీ)
ఉత్తమ సౌండ్ డిజైన్: అనిష్ జాన్ (ట్రాప్డ్)
ఉత్తమ కాస్ట్యూమ్: రోహిత్ చతుర్వేది (ఎ డెత్ ఇన్ ద గంజ్)

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -