- Advertisement -

మ‌హేశ్‌తో మ‌హేశ్‌ సెల్ఫీ అదుర్స్‌..!

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌హేశ్ తెలుగులో మాత్ర‌మే సినిమాలు చేసిన‌ప్ప‌టికి ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్స్ సైతం మ‌హేశ్‌తో ఒక్క సినిమాలో అయిన న‌టించాల‌ని ఉంద‌ని త‌మ మ‌న‌స్సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెడుతుంటారు. మ‌హేశ్ క్రేజ్‌ను ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు గుర్తించారు. మ‌హేశ్ బాబు మైనపు విగ్రహాన్ని తయారు చేసేందుకు వారు ముందుకు వచ్చారు. అచ్చం మహేశ్‌ను పోలిన మైనపు విగ్రహాన్ని వారు తయారు చేశారు. మ‌హేశ్ మైనపు విగ్రహాన్ని ఈ రోజు ఉద‌యం హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.

హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ లో విగ్రహాన్ని మహేశ్ బాబు, మేడమ్ టుస్సాడ్స్ గ్రూప్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్ర‌మానికి మ‌హేశ్ బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌తో హాజ‌ర‌య్యారు. భార్య న‌మ్ర‌త‌,కొడుకు గౌత‌మ్‌, కూతురు సితారల‌తో పాటు మ‌హేశ్ అభిమానులు కూడా భారీ సంఖ్య‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనపు విగ్రహంతో కలసి మహేశ్ కుటుంబసభ్యులు ఫొటోలు దిగారు. ఈ సాయంత్రం 6 గంటల వరకు విగ్రహాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఎంబీ సినిమాస్ మాల్‌లో ఉంచుతారు. త‌రువాత ఈ విగ్ర‌హాన్ని సింగపూర్ మ్యూజియంకు తరలిస్తారని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -