Saturday, May 4, 2024
- Advertisement -

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌ సినిమా రివ్యూ

- Advertisement -

సినిమా: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌
న‌టీన‌టులు: న‌వీన్ పోలిశెట్టి, శ్రుతి శ‌ర్మ త‌దిత‌రులు
సంస్థ‌: స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్
కథ, దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జే
స్క్రీన్ ప్లే: స్వరూప్ ఆర్.ఎస్.జే & నవీన్ పొలిశెట్టి
మ్యూజిక్: మార్క్ క్రోబిన్
కెమెరామెన్: సన్నీ కురపాటి
ఎడిటర్: అమిత్ తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
కాస్టూమ్ డిజైనర్: మౌనిక యాదవ్, వనజా యాదవ్

కథ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బి ఐ) లో డిటెక్టివ్ గా పని చేస్తూ ఉంటాడు. పెద్దగా కేసు లు కూడా ఏమీ ఉండకపోవడంతో ఎప్పటికైనా ఒక పెద్ద కేస్ సాల్వ్ చేయాలి అని కలలు కంటూ టైం పాస్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు అనుకోకుండా ఆత్రేయ జైలు పాలు అవుతాడు. అక్కడ తన జైల్ మేట్ కూతురు కనిపించకుండా పోయింది అని తెలుసుకుంటాడు. ఈ కేస్ ని సాల్వ్ చేయాలి అని నిర్ణయించుకుంటాడు ఆత్రేయ. చుట్టూ శవాలు తప్ప క్లూ లు ఏమి లేని ఈ కేస్ ని ఆత్రేయ సాల్వ్ చేయగలిగాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: నవీన్ పొలిశెట్టి నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మొదటి సినిమా అయినప్పటికీ తన నటనలో మెచ్యూరిటీ కనబరిచాడు నవీన్. యాక్టింగ్ మాత్రమే కాక డైలాగ్ డెలివరీ మరియు పైన కూడా బాగా కష్ట పడినట్లు తెలుస్తోంది. నటన పరంగా ఈ సినిమాతో నవీన్ కి మంచి మార్కులు పడతాయి అని చెప్పుకోవచ్చు. శ్రుతి శర్మ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. హీరో కి అసిస్టెంట్ పాత్ర పోషించిన ఈమె తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఈమె కారెక్టర్ చాలా అలరించే విధంగా ఉంటుంది. తన పాత్రలో శృతి శర్మ ఒదిగిపోయి చాలా చక్కగా నటించింది. సుహాస్ కి ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దొరికింది. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అందరిని దృష్టినీ ఆకర్షిస్తాడు సుహాస్. సందీప్ రాజ్ కూడా చాలా సహజంగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం: స్వరూప్ ఆర్ ఎస్ జే ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన కథను రాసుకున్నారు. మొదటి హాఫ్ కొంచెం స్లోగా నడిచినప్పటికీ రెండవ భాగంలో మాత్రం సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ట్విస్ట్ లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ఆద్యంతం చాలా బాగా నెరేట్ చేశారు దర్శకుడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మంచి నిర్మాణ విలువలను అందించారు మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. పాటల విషయం పక్కన పెడితే సినిమాలో వచ్చే నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి ఈ సినిమా కోసం మంచి విజువల్స్ ను అందించారు. అమిత్ త్రిపాఠి ఎడిటింగ్ బాగానే ఉంది.

తీర్పు: సినిమాను ఎక్కడ బోర్ కొట్టించకుండా కథను చాలా చక్కగా నెరేట్ చేశారు. దర్శకుడు కథ చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం కథను ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. మొదటి హాఫ్ లో కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ కు పెద్దపీట వేశారు. మళ్ళీ రెండవ హాఫ్ లో మాత్రం సినిమా కొంచెం సీరియస్ గా మారుతుంది. కథలో ని ట్విస్ట్ లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. సినిమా క్లైమాక్స్ కూడా బాగానే హ్యాండిల్ చేశారు. జోనర్ కి తగ్గట్టుగానే సినిమా మొత్తం కామెడీ మాత్రమే కాక సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. బలమైన కథ, నటీనటులు మరియు మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. సినిమాలోని కొన్ని బోరింగ్ సన్నివేశాలు మైనస్ పాయింట్లు గా పరిగణించవచ్చు. ఓవరాల్గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించ గలిగే మంచి సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -