తగ్గేదేలా.. ఆ ముగ్గురు స్టార్ హీరోల కంటే ముందే థియేటర్లలోకి పుష్ప రాజ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సంక్రాంతికి సినిమాల విడుదలకు సంబంధించి అఫీషియల్ డేట్ల అనౌన్స్ మెంట్ వరుసగా రెండు మూడు రోజుల నుంచి సాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా జనవరి 12న, 13న మహేష్ బాబు సినిమా, 14న ప్రభాస్ సినిమా విడుదల కానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ వన్ విడుదలయ్యే ఎప్పుడు అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు.

తాజాగా పుష్ప విడుదల తేదీ ఖరారు అయ్యింది.పవన్, మహేష్,ప్రభాస్,కంటే ఒక నెల ముందుగానే అల్లు అర్జున్ సినిమా విడుదల కానుంది. మొదటి భాగానికి పుష్ప ది రైజ్ గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ఆగస్టు 13న విడుదల కానుంది. పుష్ప సినిమాను అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. పుష్ప విడుదల తేదీ ఖరారు కావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : హీరోగా అకీరా నందన్ లాంచ్ కన్ఫామ్.. కసరత్తులు మొదలెట్టేశాడు..!

Related Articles

Most Populer

Recent Posts