- Advertisement -

త‌మిళ ఇండ‌స్ట్రీ ఓ ఫేక్ – హీరోయిన్ అమలా పాల్

- Advertisement -

హీరోయిన్ అమ‌లా పాల్ ఏం చేసిన సంచ‌ల‌న‌మే.అమలా పాల్ ఎప్పుడు వార్త‌ల్లో నిలుస్తునే ఉంటుంది.తాజాగా మ‌రో సారి త‌న మాట‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.తాజాగా ఆమె తనకు అవకాశాలిస్తున్న తమిళ సినీ ఇండస్ట్రీ మీదే విమర్శలు గుప్పించింది. కోలీవుడ్ ఒక ఫేక్ ఇండస్ట్రీ అనేసింది. గత ఏడాది విడుదలైన తన సినిమా ‘తిరుట్టు పయలే-2’ ఆశించిన స్థాయిలో ఆడని నేపథ్యంలో అసహనంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.పుష్కరం కిందట వచ్చిన ‘తిరుట్టు పయలే’కి కొనసాగింపుగా వచ్చిన చిత్రమిది. విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేసే బాబీ సింహా హీరోగా నటించాడు.

అమల అతడి భార్యగా నటించింది. మంచి థ్రిల్లర్ అయిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఐతే ఒక పెద్ద హీరో నటించి.. కొంచెం కమర్షియల్ అంశాలుంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని అంటోంది అమల. బాలీవుడ్లో ఇలా హీరో స్థాయి.. కమర్షియల్ అంశాల గురించి పట్టించుకోరని.. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని.. తమిళంలో అలా కాదని.. అందుకే ఇది ఫేక్ ఇండస్ట్రీ అని సంచలన వ్యాఖ్యలు చేసింది అమల.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -