- Advertisement -

వామ్మో టీవీ9 దీప్తి ప్లాన్ మామూలుగా లేదుగా..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది.మ‌రికొద్ది రోజుల్లో షో ముగియ‌నుంది.16 మంది స‌భ్యుల‌తో మొద‌లైన రెండో సీజ‌న్‌లో చివ‌ర‌కి ఆరుగురు మాత్ర‌మే మిగిలారు.ఇక షో మొద‌టి నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతునే ఉన్నాయి.అయితే ఈ వారంలో గొడ‌వ‌లు కాస్తా శృతిమించాయి.ఎవ‌రికి వారు బిగ్‌బాస్ విన్న‌ర్ కావాల‌నే క‌సితో గేమ్ ఆడుతున్నారు.బిగ్‌బాస్‌లో ప్ర‌స్తుతం ఉన్నవారిలో ముగ్గురికి మాత్ర‌మే బ‌య‌ట ఫాలోయింగ్ ఉంది.కౌశ‌ల్ గురించి మ‌నం ప్రత్యేకంగా చెప్పుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.గీతా మాధ‌రి,త‌నీష్‌ల‌కు కాస్తా,కుస్తో ప్రేక్ష‌కుల‌లో ఫాలోయింగ్ ఉంది.రోల్ రైడా,సామ్రాట్‌లు ల‌క్ కొద్ది ఇంత దూరం వచ్చారు.మరి దీప్తి నల్లమోతు బిగ్‌బాస్ ఫైన‌ల్ వ‌ర‌కు ఎలా వ‌చ్చిందో ఎవ‌రికి అర్థం కావడం లేదు.

ఆమెకు బ‌య‌ట ప్రేక్ష‌కుల‌లో పెద్ద‌గా మ‌ద్ద‌తు లేద‌ని చాలామంది అభిప్రాయం.కానీ గత కొద్దిరోజులుగా ఆమె ఓటింగ్ శాతం పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కౌశల్ కి 60శాతం ఓట్లు నమోదైతే.. దీప్తికి 20 శాతం నమోదయ్యేవి. కానీ ఇప్పుడు కౌశల్‌తో సమానంగా ఒకానొక సమయంలో అతడిని బీట్ చేసే రేంజ్ లో ఆమెకు ఓట్లు నమోదు అవుతున్నాయ‌ని తెలుస్తుంది.దీప్తికి వ‌చ్చే ఓట్లు అన్ని ఫేక్ అని ఆరోపిస్తుంది కౌశ‌ల్ ఆర్మీ.దీప్తి భ‌ర్త శ్రీకాంత్ ఓ కంపెనీతో మాట్లుడుకొని దీప్తి ఓట్లు వేసేలా డీల్ సెట్ చేశార‌ని , ఈ విషయాన్నిఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు కౌశ‌ల్ ఆర్మీ. ఫేక్ ఐడీల ద్వారా ఓట్లు వేయించుకుంటోందని అందుకే ఆమె ఇంకా హౌస్‌లో కొనసాగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో వారికే తెలియాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -