- Advertisement -

MSGతో నైజాంలో చిరు పాగా!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం మన శంకర వారప్రసాద్ గారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి వారంలో దాదాపు రూ.300 కోట్లకు చేరువలో వసూళ్లను రాబట్టింది. చిరు సరసన నయన్ హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు.

ఇక మన శంకరవరప్రసాద్ గారుతో చిరు బాక్సాఫీస్ రారాజుగా నిలవగా నైజాంలో మళ్లీ పాగా వేశారు. ఆదివారం ఈ సినిమా ₹3.40 కోట్లు షేర్ ను రాబట్టింది. మొత్తంగా మొదటి వారం నైజాం షేర్ ₹32.5 కోట్లు ను అధిగమించింది.

వాల్తేరు వీరయ్య నైజాంలో మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ, భోలా శంకర్ నిజాం మార్కెట్‌లో నిరాశజనకంగా నిలిచింది. అయితే తాజాగా మన శంకరవరప్రసాద్‌ గారుతో తన పూర్వ వైభవాన్ని తెలంగాణలో తిరిగి సాధించాడు.

ఈ చిత్రాన్ని సాహు గరపాటి మరియు సుశ్మితా కోనిదెల నిర్మించారు. Shine Screens మరియు Gold Box Entertainments బ్యానర్‌ ద్వారా విడుదల చేయగా కేథరిన్ ట్రెసా, అభినవ్ గోమటం, జరీనా వాహాబ్, హర్షవర్ధన్ ఇతరులు నటించారు. సంగీతం భీమ్స్ సెసిరొలియో అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -