Sunday, May 5, 2024
- Advertisement -

హిట్టు కొట్టాల్సిందే!

- Advertisement -

కంచె ఖతర్నాక్ హిట్ అయ్యింది. మేనల్లుడి సుబ్రమణ్యం ఫర్ సేల్.. బాగానే కలెక్షన్లు రాబట్టింది. కానీ.. ముద్దుల కొడుకు సినిమా బ్రూస్ లీ మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. ఇదే.. మెగాస్టార్ చిరంజీవిలో గుబులు పుట్టించింది. ఆఖరికి తన చరిష్మా కూడా బ్రూస్ లీని కాపాడలేకపోవడం.. చిరుకు బాధ కలిగించిందట. అందుకే ఈ సారి ఎలాగైనా చెర్రీకి మంచి హిట్ రావాల్సిందే అని కష్టపడుతున్నట్టు ఫిలిమ్ నగర్ సర్కిల్స్ అంటున్నాయి.

బ్రూస్ లీ విషయంలో చేసిన తప్పులను రిపీట్ చేయకుండా.. ఈ సారి చరణ్ కొత్త మూవీ థియేటర్స్ కి వెళ్లేంతవరకు అన్నీ తానై నడిపించాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

బ్రూస్ లీ విషయంలో చాలా తప్పులే జరిగాయని మెగా క్యాంప్ ఫీలవుతోందట. ఆగడు లాంటి బ్లాక్ బస్టర్ డిజాస్టర్ ఇచ్చిన శ్రీనువైట్లను ఈ సినిమాకు డైరెక్టర్ గా ఎంపిక చేసింది మొదలు… సినిమా ఫైనల్ కాపీని చిరంజీవి చూసేవరకూ చాలా విషయాల్లో పక్కా ప్లాన్ లేకపోవడమే బ్రూస్ లీ ఫెయిలవడానికి కారణమని మెగా ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు. అదీ కాక.. చరణ్ ఈ సినిమాలో చిరు పాత పాటను రీ మిక్స్ చేయకపోవడం కూడా ఫెయిలవడానికి ఓ కారణమని మరికొందరు సెంటిమెంట్ లేవనెత్తుతున్నారు. ఇదే టైమ్ లో.. సాయి ధరమ్ తేజ్ సినిమా సుబ్రమణ్యం ఫర్ సేల్ లో.. గువ్వా గోరింకతో పాట రీమేక్ ఎంత సెన్సేషన్ అయ్యిందో గమనించాలని తమ వాదనకు ఉదాహరణ కూడా చూపిస్తున్నారు.

అసలే.. 150వ సినిమా కన్ఫ్యూజన్ లో ఉన్న చిరంజీవికి.. బ్రూస్ లీ ఇలా దారుణంగా ఫెయిలవడం మరింత అయోమయాన్ని కలిగించిందని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న చిరంజీవి… ఇకపై తన సినిమాతో పాటు.. చర్రీ సినిమాకు సంబంధించి.. స్టోరీ సిటింగ్స్ నుంచి సినిమా రిలీజ్ వరకు.. బాధ్యత మొత్తం భుజాన వేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రచ్చ, నాయక్ సినిమాలకు చివరి దశలో.. మార్పులు సూచించి.. వాటి సూపర్ హిట్ కు కారణమైన చిరంజీవి… ఈ సారి టైటిల్ కార్డ్స్ నుంచి శుభం కార్డ్ వరకు మెగా ముద్ర చూపించేందుకు డిసైడైనట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -