Monday, May 13, 2024
- Advertisement -

శివాజీకి మండింది.. ఆ పార్టీపై దుమ్మెత్తిపోశాడు..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన గురించి నిరాహార దీక్ష చేస్తున్న శివాజీ తను వెనక్కు తగ్గేది లేదని అంటున్నాడు. ఇప్పటికే శివాజీ నిరాహారదీక్ష ప్రారంభం అయ్యి మూడో రోజు వచ్చేసింది. ఈ నేపథ్యంలో శివాజీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వచ్చే వరకూ నిరాహార దీక్షను కొనసాగిస్తానని అంటున్నాడు. తన ప్రాణం పోయినా వెనక్కుతగ్గను అంటున్నాడాయన.

ఇదే సమయంలో శివాజీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేయడం విశేషం. విభజన సమయంలో భారతీయ జనతా పార్టీ వాళ్లు ఏపీకి ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చారని శివాజీ అన్నాడు. అయితే భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడకపోవడం దారుణం అని శివాజీ అంటున్నాడు. ఈ విధంగా కమలం పార్టీ తీరును శివాజీ తప్పు పట్టాడు.

మరి ఎన్నికల ముందు శివాజీ కూడా కమలం పార్టీ కండువా వేసుకొన్న వ్యక్తే. నరేంద్రమోడీకి మద్దతు ప్రకటించిన వ్యక్తే. అయితే ఇప్పుడు శివాజీ పై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. శివాజీ దీక్షల పై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఇక బీజేపీ అగ్రనేతలు కూడా శివాజీతో తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇది వరకూ సోమూ వీర్రాజు ఈ విషయాన్ని చెప్పగా.. గుంటూరులో శివాజీ దీక్ష చేపట్టిన నేపథ్యంలో పురందేశ్వరి శివాజీపై విమర్శలు చేశారు. శివాజీకి భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని వీరు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శివాజీ భారతీయ జనతా పార్టీ పై సూటిగా విమర్శలు చేయడం విశేషం! మరి ఈ విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఇంకా ఎలా ముందుకు వెళతాయో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -