శ్రియ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అన్న సంగతి అందరికి తెలిసిందే.ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటిన ఇప్పటికి సినిమాలు చేస్తు బిజీగా ఉంది శ్రియ.ఇప్పటికి కూడా హీరోయిన్‌గానే చేస్తుంది శ్రియ.ఇటీవలే పెళ్లి చేసుకున్న శ్రియ ఇక సినిమాలు మానేస్తుందనే ప్రచారం జరిగినప్పటికి అలాంటిది ఏం జరగలేదు.పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలు చేస్తుంది శ్రియ.పెళ్లి అయిందనే కారణంగానో మరెమో తెలియదు కాని శ్రియకి ఓ అత్త క్యారెక్టర్ వచ్చిందని తెలుస్తుంది.నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో చైతుగా అత్తగా శ్రియ ఎంపిక అయిందని సమాచారం.
ఇప్పటికే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ శైలజరెడ్డి అల్లుడు సినిమాలో చైతుకి అత్తగా నటించింది.
జై లవకుశ దర్శకుడు కెఎస్.రవీంద్ర వెంకీ మామ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తున్నాడు.చైతుగా మామగా వెంకీ నటీస్తున్నాడు.వెంకటేశ్ పక్కన హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేశారట.చాలాకాలం తరువాత వెంకీ పక్కన హీరోయిన్‌గా నటిస్తుంది శ్రియ.నాగ చైతన్యకు హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సెలెక్ట్ చేశారట.ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
- టీచర్ల సస్పెన్షన్.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం!
- బాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే..
- ప్రియురాలిని చంపి.. గోనెసంచిలో మూటగట్టి..
- గాలె టెస్టు.. వర్షం అడ్డంకి!
- కన్నకొడుకునే సీరియల్ కిల్లర్‌గా మార్చిన తల్లి..!
