నిన్న రాధికా ఆప్టే.. ఇప్పుడు ఈవిడగారు

- Advertisement -

సౌత్ సినిమాల గురించి హీరోల గురించి బిటౌన్ పోరి రాధికా ఆప్టే మాట్లాడినంత దారుణంగా ఎవ్వరూ మాట్లాడి ఉండరు. ఆ ఎఫెక్ట్ అందరికంటే ఎక్కువగా తెలుగు సినిమాకు తగిలింది. రాధికా ఒక్కరే అంతలా మాట్లాడింది. ఆ మధ్య తాప్సీ కేవలం కే రాఘవేంద్రరావును బ్లేమ్ చేస్తూ మాట్లాడింది. ఆతరువాత ఆ లిస్ట్ లోకి వచ్చి మాట్లాడే వేరే నటి ఎవ్వరూ మనకు కనిపించలేదు. తాజాగా హీనా ఖాన్ అనే టీవీ బ్యూటీ ఇప్పుడు సౌత్ సినిమాలపై చవకబారు కామెంట్లు చేసింది. అయితే ఆమేమి సౌత్ కు వచ్చి ఎక్కడా ఎలాంటి ఇష్యూలోను చిక్కుకోలేదు. అయితే ఈవిడ….మనల్ని తిట్టడానికి బిగ్ బాస్ షోను వేదికగా చేసుకుంది. గతంలో హిందీ వరకే ఉండే బిగ్ బాస్ షోలు.. ఇప్పుడు సౌత్ లో కూడా వచ్చాయనే విషయం మనకు తెలిసిందే.

తాజాగా హిందీ బిగ్ బాస్ షోకు మాత్రం తెగ కామెంట్లు వస్తున్నాయి. అసలే మాత్రం ఆకర్షణీయంగా లేదనే కామెంట్స్ ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసింది పార్టిసిపెంట్ హీనా ఖాన్. ఈమె కామెంట్స్ చూస్తే… సౌత్ సినిమాల్లో బాగా దిట్టంగా ఉంటేనే జనాలకు నచ్చుతారు. అంతే కాదు.. డ్యాన్సులు కూడా చాలా అసభ్యంగా ఉంటాయని చెబుతుంది. అసహ్యకరమైన మూమెంట్స్ చేయిస్తారు. అందుకే తనకు ఓ రెండు భారీ చిత్రాల ఆఫర్స్ వచ్చినా నటించలేదని చెప్పింది.

- Advertisement -

ఈమె చెప్పినవాటిలో ఒక సినిమా… మహేష్ బాబు.. వెంకటేష్ హీరోలని చెబుతుంది. అంటే . ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పకపోయినా అర్ధమయిపోతుంది. కాని ఈ సినిమాలో తాను చేయనందుకు మాత్రం ఇప్పటికీ ఫీలవుతూ ఉంటానంటుంది. కేవలం… బిగ్ బాస్ లో క్రేజ్ కోసం.. ఇలా సౌత్ పై చెత్త కామెంట్లు చేయడం వలన ఈమె కొచ్చే లాభ మేమిటో ఈవిడగారికే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -